Wednesday, November 1, 2017

లుప్తఛందస్సు - సుదాముని వృత్తాంతము (అంశంలో కూడా క నిషేధం)


సాదరమున దార సాదమె నివేదన జేయుమని
సుదాముని సాగనంపె మూటనింపి ఆదరముగ
ఉదారుడౌ వాసుదేవుడు సంతుష్టుడై యారగింప
ఆ దయ ప్రసాదం చెలువుని పాలిట ప్రసాదనమాయె 

[నిషిద్ధాక్షరి
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - లుప్తం]


జిలేబామ్మ పుణ్యం: http://varudhini.blogspot.com/2017/11/blog-post.html

5 comments:



  1. భేషౌ ! కొంత సరి జేస్తే తురగవల్గన రగడ



    సాదరమున దార సాద మునట వేదన జేయుమని
    యాదరముగ సాగనంపె ముడుపు నిడుచు సుదామునిన్
    ఉదారుడౌ వాసుదేవుడు సంతుష్టుడవన్ యెలమి
    గ దయ గొన ప్రసాదము స్నేహితునికిన్ ప్రసాదన సుమి !

    తురగవల్గన రగడ

    జిలేబి

    ReplyDelete


  2. స్వల్ప అడ్జస్ట్ మాడి :)


    పన్నారి వారి తురగవల్గన రగడ

    సాదరమున దార సాద మునట వేదన జేయుమని
    యాదరముగ సాగనంపె ముడుపు నిడుచు సుదామునిన్
    ఉదారుడౌ వాసుదేవుడు సంతుష్టుడవన్ యెలమి
    గ దయ గొన ప్రసాదము మిహిగ చెలుమరి ప్రసాదన సుమి

    ReplyDelete
    Replies
    1. అడ్జస్ట్ మాడిదవరూ నీవే - మాడిదమేలె "అడ్జస్ట్ మాడి" అంథా హేళిదవరూ నీవే! ధన్యవాదగళు!

      Delete
  3. ఆహా ! యేమి రుచిర ! యీ
    పోహాలు తినగ సుదామ ! బుధ్ధి గలిగెడి నం
    చా హరి మరిన్ని యడుగగ
    మోహంబుల నాపె సిరియు ముద్దుగ మగనిన్ .

    ReplyDelete


  4. పన్నారి మంచి పలుకులు
    మిన్నగ పదములు జిలేబి మించారుగనన్
    పన్నుదురు గాక ! జనులున్
    కన్నుల కద్దుకొని బాగుగా కామింటన్ :)

    జిలేబి

    ReplyDelete