ఏం కట్టే ?
పేరు కట్టే
ఏం కొట్టే ?
పేరు కొట్టే
ఏం తెచ్చే ?
పేరు తెచ్చే
ఏం పేరు కట్టే ?
దోచిన సొమ్ము ఎంతో పేరు కట్టే
ఏం పేరు కొట్టే ?
కొంత పంచి మంచివాడని పేరు కొట్టే
ఏం పేరు తెచ్చే ?
పంచిన కొంత ఎంతో పేరు తెచ్చే
అదీ నేటి రాజకీయణం
కట్టే... కొట్టే... తెచ్చే...
అంటూ
ముత్యం మూడు మాటల్లో!
కొట్టె, కొట్టె, కొట్టె
ReplyDeleteమట్టిని కొట్టె,
మనీ కొట్టె,
మొత్తం కొట్టె.
ఇది 'రాబ్'కీయణం.