Friday, October 6, 2017

తెలివిడి - నిలకడ

తనకి తెలియదు
తనకి తెలియదని తనకే తెలియదు
తనకి తెలియదని తెలియని 
తన తెలియనితనాన్ని తెలియనట్లుంటే పోలా!

తనకి తెలియదు
తనకి తెలియదని తనకీ తెలుసు
తనకి తెలియదని తెలిసిన తనకి
తెలియనిది తెలియచెప్తే చాలా?

తనకి తెలుసు
తనకి తెలుసని తనకే తెలియదు
తనకి తెలుసని తెలియని తనకి
తెలిసినది తెలియజేస్తే మేలా !

తనకి తెలుసు
తనకి తెలుసని తనకి బాగా తెలుసు
తనకి తెలుసని తెలిసిన తనని
తెలుసుకుని తోడు కూడు ఇలా !

తనకి తెలుసో? తెలియదో ?
తెలిసినది ఎంత తెలుసో తెలియదు
తెలియనిది ఎందుకు తెలియదో తెలియదు
తెలిసీ తెలియని తనని
తెలిసీ తెలియనట్లుంటే మన తెలివిడి నిలకడే!

No comments:

Post a Comment