Tuesday, December 12, 2017

మూడు ద్వైతాలు - ఒక అద్వైతం


ఒకటి
ఇంకొకటి 
పగలు ఒకటి
రేయి ఇంకొకటి
పగటికి రేయికి దీపాలు చెరొకటి

ఒకటి
ఇంకొకటి
నేల ఒకటి
నింగి ఇంకొకటి
నేలకి నింగికి హద్దులు చెరొకటి 

ఒకటి
ఇంకొకటి
అద్దరి ఒకటి
ఇద్దరి ఇంకొకటి
అద్దరికి ఇద్దరికి ఒడ్డులు చెరొకటి

ఒకటి
ఇంకొకటి
నా నీవొకటి
నీ నేనింకొకటి 
నా నీవుకి నీ నేనుకి నేను-నీవులు చెరొకటి