Saturday, April 29, 2023

మాయే भी ... జిలేబీ!!!

 


పజ్యాలల్లుటలో busy bee
ఆజ్యాలోయుటలో - కానేకాదు - lazy bee

వెదజల్లే నవ్వత్తరు గులాబీ
ఎద గిల్లే గమ్మత్తుల భలేబీ

బొమ్మ చూపెట్టని కనికట్టు షాడోబీ
బామ్మనని చెవిలో పెట్టు  - ఓ పేద్ద కాబేజీ

వాదోపవాదాలకెపుడూ కాయ్-రాజా-కాయ్బీ
సుందోపసుందులని మించిన మాయాబీ

ఎవరది... ఎవరది?
ఇంకెవరది?!
కాక మరది... 
మనందరి -
మనవళ్ళందరి -
మనవాళ్ళందరి -
మాయాబామ్మ ರೀ!

Whatever may be...
तभी... अभी...  
कभी भी... 
మాయే भी...
జిలేబీ!!!

Tuesday, April 18, 2023

మా జిలేబామ్మొచ్చేసె బ్లాగిళ్ళకు...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...
మా జిలేబామ్మొచ్చేసె బ్లాగిళ్ళకు
పజ్యాలు పొర్లాయి కామింట్లకు
ఆజ్యాలు రగిలాయి మీ బోంట్లకు...
అహాహా...అహ్హా...అహాహా! 

Sunday, June 9, 2019

చినుకు కోసం...

చిన్ని నవ్వు
చిట్టి పలుకు 
చిలకరింపు ఎందుకోసం ?

మట్టి నేల
గడ్డి పూవు
ఎదురుచూపు దేని కోసం?


ఉరుము పిలుపు
మెరుపు వెలుగు
పుడమి ఎలుగు ఎవరికోసం?

మింటి అంచున జారి జారి
వానవిల్లు పంచన  జాలువారి
ఉరికి ఉరికి
నేల పురికి
గాలి పురుల అల్లుకు 
చిందుచిందుకు తొణుకు
మేలి సరాల జల్లుల   
చల్లని చినుకు కోసం
చినుకు పోసే ఉసురు కోసం
ఉసురు పెంచే ఉనికి కోసం

ఉనికి కోసం
ఉసురు కోసం
చినుకు కోసం...

Tuesday, December 12, 2017

మూడు ద్వైతాలు - ఒక అద్వైతం


ఒకటి
ఇంకొకటి 
పగలు ఒకటి
రేయి ఇంకొకటి
పగటికి రేయికి దీపాలు చెరొకటి

ఒకటి
ఇంకొకటి
నేల ఒకటి
నింగి ఇంకొకటి
నేలకి నింగికి హద్దులు చెరొకటి 

ఒకటి
ఇంకొకటి
అద్దరి ఒకటి
ఇద్దరి ఇంకొకటి
అద్దరికి ఇద్దరికి ఒడ్డులు చెరొకటి

ఒకటి
ఇంకొకటి
నా నీవొకటి
నీ నేనింకొకటి 
నా నీవుకి నీ నేనుకి నేను-నీవులు చెరొకటి


Thursday, November 23, 2017

ఎంచక్కా జూడన్ చక్కని చుక్కల్ అగుపడుననెన్ !



చుక్క కనిపించిన దెవరికో?
ఎక్కడ బామ్మోయ్  జిలేబి యనన్ !
పక్కల చూడకు మనెన్
ఎంచక్కా జూడన్ చక్కని చుక్కల్ అగుపడుననెన్ !

http://varudhini.blogspot.com/2017/11/blog-post_24.html



Saturday, November 18, 2017

పన్నెద నే పన్నాలకొద్దీ పన్నులనే!

పన్ననా !
పన్నులే పన్ననా !
పన్నాలకొద్దీ  పన్నులే పన్ననా  !
మన్నికగల పన్నాలకొద్దీ  పన్నులే పన్ననా !
పన్నాలనిపించే మన్నికగల పన్నాలకొద్దీ  పన్నులే పన్ననా !
పన్నినకొద్దీ పన్నాలనిపించే  మన్నికగల పన్నాలకొద్దీ  పన్నులే పన్ననా!
పన్నారీ! నోటిపన్ను బాధ, ఆదాయపు పన్నుబాధ - లను మించిన నీ పన్ను బాధ మాకింకొద్దు సుమీ !
అన్న ఆపన్నుల కాచుట కే వెన్నుడు రావలెనో గదా!  అనిపించగ
జనులను జడిపించగ
నను నేనే మించగ
పన్నెద నే పన్నాలకొద్దీ పన్నులనే!

Wednesday, November 8, 2017

చందమె బో యిక పనారి చక్కని కందం!

కందను కూరగ దింటిని
కందము నొండెద కలకల కందని దీయని
కందము నే పన్నగనే
చందమె బో యిక పనారి చక్కని కందం!

Wednesday, November 1, 2017

లుప్తఛందస్సు - సుదాముని వృత్తాంతము (అంశంలో కూడా క నిషేధం)


సాదరమున దార సాదమె నివేదన జేయుమని
సుదాముని సాగనంపె మూటనింపి ఆదరముగ
ఉదారుడౌ వాసుదేవుడు సంతుష్టుడై యారగింప
ఆ దయ ప్రసాదం చెలువుని పాలిట ప్రసాదనమాయె 

[నిషిద్ధాక్షరి
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - లుప్తం]


జిలేబామ్మ పుణ్యం: http://varudhini.blogspot.com/2017/11/blog-post.html

Sunday, October 29, 2017

పన్నగ-శయనుడైన ఆ వెన్నుడే నాకిక గతిబో!

కంద-పద్య-మణి మా బామ్మ జిలేబీ!
జిలేబీ తీపిని మరిగిన ఔదురు bee-లేజీ! 
లేజీ రోజుల తాజా కావించు మీ కందాలు
కందాలు కావవి "పన్నా"రవిందాలు.


ప్రయ్నతించానొక ముక్తపదగ్రస్తం
అభిమాన పూరిత జిలేబీయం!
నా పన్నుని చదివి హన్నా! అన్నచో
పన్నగ-శయనుడైన ఆ వెన్నుడే నాకిక గతిబో!

Monday, October 23, 2017

తల్లడిల్లి దివాలీ ఆయె దీపావళి!

ఇంటను వెలిగే  కళికల కాంతులు 
మింటను మెరిసే చుక్కలతో పోయె వంతులు
కళికల గాంచి మురిసె దీపావళి!   

దీప ఆవళుల తోరణ జిగినీ
మిలమిలలాడుత ధరించె రజని
తోరణపు దివ్వెల మెరిసె దీపావళి!

దివాలా నీడ  సోకని  దీపావళి
ళ-కారం జాడ దొరకని తెలుగులో
తల్లడిల్లి దివాలీ ఆయె దీపావళి!


Friday, October 6, 2017

తెలివిడి - నిలకడ

తనకి తెలియదు
తనకి తెలియదని తనకే తెలియదు
తనకి తెలియదని తెలియని 
తన తెలియనితనాన్ని తెలియనట్లుంటే పోలా!

తనకి తెలియదు
తనకి తెలియదని తనకీ తెలుసు
తనకి తెలియదని తెలిసిన తనకి
తెలియనిది తెలియచెప్తే చాలా?

తనకి తెలుసు
తనకి తెలుసని తనకే తెలియదు
తనకి తెలుసని తెలియని తనకి
తెలిసినది తెలియజేస్తే మేలా !

తనకి తెలుసు
తనకి తెలుసని తనకి బాగా తెలుసు
తనకి తెలుసని తెలిసిన తనని
తెలుసుకుని తోడు కూడు ఇలా !

తనకి తెలుసో? తెలియదో ?
తెలిసినది ఎంత తెలుసో తెలియదు
తెలియనిది ఎందుకు తెలియదో తెలియదు
తెలిసీ తెలియని తనని
తెలిసీ తెలియనట్లుంటే మన తెలివిడి నిలకడే!

Sunday, September 24, 2017

బామ్మా మియ - సెంపర్ విరం!

మా జిలేబామ్మ ! आप ఆట్ టు సే "మియ ఇన్నోసెన్షియ"
ఫ్రీ యువర్‌సెల్ఫ్ ఆఫ్ గిల్ట్ !
తు నహి పిస్త్రిక్స్ బట్ మిస్టిక్
బామ్మా మియ ! యుతిలె దుల్సీ!
మీరెన్నడూ సెంపర్ విరం!
మేలే మీరౌర !
పన్నారి -  సెంపర్ ఫిడలిస్!

Wednesday, September 13, 2017

Et Tu అంటే తెలియదంటే నమ్మేదెట్టులమ్మా ?!


జిగిబిగి కబుర్ల జిలేబామ్మా
జిలిబిలి కందాల ఛందపు బామ్మా 
కామెంటులు minటుటలోఎల్లరకూ mentor అయిన బామ్మా
Et Tu అంటే తెలియదంటే నమ్మేదెట్టులమ్మా ?!