చిన్ని నవ్వు
చిట్టి పలుకు
చిలకరింపు ఎందుకోసం ?
మట్టి నేల
గడ్డి పూవు
ఎదురుచూపు దేని కోసం?
ఉరుము పిలుపు
మెరుపు వెలుగు
పుడమి ఎలుగు ఎవరికోసం?
మింటి అంచున జారి జారి
వానవిల్లు పంచన జాలువారి
ఉరికి ఉరికి
నేల పురికి
గాలి పురుల అల్లుకు
చిందుచిందుకు తొణుకు
మేలి సరాల జల్లుల
చల్లని చినుకు కోసం
చినుకు పోసే ఉసురు కోసం
ఉసురు పెంచే ఉనికి కోసం
ఉనికి కోసం
ఉసురు కోసం
చినుకు కోసం...
చిట్టి పలుకు
చిలకరింపు ఎందుకోసం ?
మట్టి నేల
గడ్డి పూవు
ఎదురుచూపు దేని కోసం?
ఉరుము పిలుపు
మెరుపు వెలుగు
పుడమి ఎలుగు ఎవరికోసం?
మింటి అంచున జారి జారి
వానవిల్లు పంచన జాలువారి
ఉరికి ఉరికి
నేల పురికి
గాలి పురుల అల్లుకు
చిందుచిందుకు తొణుకు
మేలి సరాల జల్లుల
చల్లని చినుకు కోసం
చినుకు పోసే ఉసురు కోసం
ఉసురు పెంచే ఉనికి కోసం
ఉనికి కోసం
ఉసురు కోసం
చినుకు కోసం...
No comments:
Post a Comment